కమాన్‌చౌరస్తా, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలు నగరంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణతో సందడి చేశారు. అశోక్‌నగర్ మలయాళ సద్గురు గీతామందిరం సన్మాన మఠంలో విష్ణుసేవానందగిరి స్వామి పర్యవేక్షణలో సాయినగర్ మురళీకృష్ణాలయంలో ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కరీంనగర్ శాఖ అధ్యక్షుడు దుంద్ర రాజన్న యాదవ్ ఆధ్వర్యంలో ఉజ్వల పార్ వద్ద యాదవ భవనంలో వేడుకలు నిర్వహించారు. గిద్దె పెరుమాళ్ల అలయం వద్ద ఉట్టి కొట్టే వేడుక జరిపారు. అనంతరం కోలాటం, డోలు విన్యాసాల నడుమ సాయినగర్ మురళీకృష్ణ మందిరం వరకు రథయాత్ర నిర్వహించారు. మల్లయ్య, చెర్ల పద్మదానయ్య, సాయవేని వైజయంతి, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, గట్ట యాదవ్, ముంజ రాజేందర్, దానయ్య, పోచమల్లు, మల్లయ్య, బొల్లవేని శ్రీనివాస్, గాదె పరశురాం పాల్గొన్నారు. శ్రీచైతన్య టెక్నో స్కూల్ (వావిలాలపల్లి)లో వేడుకలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, శ్రీవిద్య, ఆర్ఐ రాజు, కృష్ణారావు, ప్రిన్సిపాల్ రవీందర్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 30: కరీంనగర్ మండలంలో సోమవారం శ్రావణ అష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చెర్లభూత్కూర్ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తిని ఆలయం బయటకు తీసుకువచ్చి చిన్నారులతో ఉట్టి కొట్టించారు. మాజీ సర్పంచ్ కూర సత్యనారాయణరెడ్డి, కృష్ణ మాలధారులు, ఆలయ కమిటీ సభ్యులు, వేణుగోపాల స్వామి భక్తులు, మహిళల సంకీర్తనతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. చేగుర్తి వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడు వెంకటేశ్వరాచార్యులు రుక్మిణి,సత్యభామ సహిత వేణుగోపాలస్వామికి ఫల పంచామృతాభిషేకాలు చేశారు. దుర్శేడ్ వేణుగోపాలస్వామి ఆలయంలో మధుసూదనాచార్యులు గోదాదేవీసహిత వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలబోతారం మురళీకృష్ణ దేవాలయంలో తులసీదళార్చన చేశారు. గోపాల్పూర్ మురళీ కృష్ణ దేవాలయంలో అర్చకుడు మధుసూదనాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఉట్టికొట్టే కార్యక్రమంలోయువకులు యువకులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఆగస్టు 30: శ్రీకృష్ణాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉజ్వల పార్కు సమీపంలోని యాదవ సంఘ భవనంలో శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేశారు. యాదవ కుల దైవం శ్రీకృష్ణుని వేడుకులు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారని ఆ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు బండిమల్లయ్య, వైజయంతి, పద్మ, బుచ్చన్న, ఓదెలు తదితరులుపాల్గొన్నారు.