హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 10: బ్రాహ్మణుల ఆశీర్వచనంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బ్రాహ్మణుల ఆశీర్వాదంతో విజయంపై మరింత విశ్వాసం పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో హుజూరాబాద్ నియోజకవర్గస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు అతిథులుగా హాజరయ్యారు. విష్ణు దాస్ గోపాల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో మంత్రి హారీశ్‌రావు మాట్లాడారు. ప్రతి బ్రాహ్మణుడు వంద ఓట్లతో సమానమన్నారు. బ్రాహ్మణుల సమస్యలను కోడ్ ముగిశాక పరిషరించేలా కృషి చేస్తానన్నారు. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అర్చకులు, ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలోని బ్రాహ్మణులు సంఘటితమై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే బ్రాహ్మణులకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. అర్చకులకు పే సేల్ వర్తింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హుజూరాబాద్‌లో బ్రాహ్మణ భవనానికి భూమి కేటాయించాలని, వంద మందికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి బెస్ట్ సీమ్ ద్వారా లబ్ధి చేకూర్చాలని కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ జీఎఫ్ ఫండ్‌కు ఆర్థికశాఖ నుంచి నిధులు కేటాయించాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు వస్తాయని, ఉద్యోగులకు మొదటివారంలోనే వేతనాలు వచ్చేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ, అర్చక సంక్షేమానికి దేశంలోనే పెద్దపీట వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మంత్రికి లేఖ అందజేశారు. అనంతరం హరీశ్‌రావును జ్ఞాపికతో సతరించారు. బ్రాహ్మణ సంఘం హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు చెన్నూరి సురేశ్‌శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి రాహుల్కుమారాచార్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, బ్రాహ్మణ మహిళా సంఘం నాయకురాలు దేవులపల్లి వాణి, వేముగంటి నరేంద్రాచార్యులు, విష్ణుదాసు మహిధర్రావు, దుర్గాప్రసాద్‌శర్మ, పెండ్యాం రాఘవరావు పాల్గొన్నారు.