జమ్మికుంట రూరల్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమ బిడ్డ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని విలాసాగర్, వెంకటేశ్వర్లపల్లి, పాపయ్యపల్లి, సైదాబాద్ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశం సోమవారం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అలాగే జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్హాల్లో మడిపల్లి, మాచనపల్లి, పెద్దంపల్లి, జగ్గయ్యపల్లె, అంకుషాపూర్ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉద్యమ బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ దొడ్డె మమత, నాయకులు శ్రీధర్‌రెడ్డి, కనపర్తి లింగారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.