హుజూరాబాద్‌టౌన్/ఇల్లందకుంట, ఆగస్టు 24: హుజూరాబాద్ పట్టణంలోని రెండో వార్డు గణేశ్‌నగర్‌లో మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ ఓటర్లకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణేశ్‌నగర్, కుమ్మరివాడ, ప్రతాపవాడ, ఆరెవాడ, పద్మశాలీ సంఘం ఏరియా, మామిండ్లవాడ తదితర వాడల పరిధిలో కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అంతకుముందు గణేశ్‌నగర్ మహిళలు శ్రీనివాస్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన వెంట రెండో వార్డు కౌన్సిలర్ బర్మావత్ యాదగిరి, ఇతర వార్డుల కౌన్సిలర్లు మకపల్లి కుమారస్వామి, మారేపల్లి సుశీల, నాయకులు ప్రతాప కృష్ణ, బీఎస్ ఇమ్రాన్ తదితరులున్నారు.
12, 13, 15వ వార్డులలో కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. పలు దళితవాడల్లో పర్యటించి దళితబంధు పథకం గురించి వివరించారు.
26వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ పుల్లూరి శ్రీకాంత్ ఇంటింటికీ బొట్టు పెట్టే కార్యక్రమం చేపట్టారు.
23వ వార్డులో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ మొలుగూరి సృజనాపూర్ణచందర్ ప్రచారం నిర్వహించారు. 14వ వార్డులో పార్టీ ఇన్చార్జి పటణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సిద్దిపేట ఇన్చార్జి కనకరాజు, కరీంనగర్ ఇన్చార్జి ఆనందరావు, 14వ వార్డు అధ్యక్షుడు గంట మధుకర్, పీఏసీఎస్ డైరెక్టర్ వజ్జపెల్లి వెంకటేశ్వర్లు డోర్ టూ డోర్ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వాడ పెద్ద మనుషులకు గులాబీ కండువాలు కప్పి పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనేలా చూశారు. ఆయా చోట్ల నాయకులు గంట కొమురయ్య, మాసాడి సంపత్‌రావు, కౌడగాని శ్రీనివాస్, నాంపెల్లి చంద్రమొగిలి, గంట వెంకటేశ్, సాయి తేజ, కుసుంబ సంపత్‌రావు, కేశబోయిన కుమార్, కార్యకర్తలున్నారు.
బోగంపాడులో ఎమ్మెల్యే సుంకె ప్రచారం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో గడపగడపకూ తిరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను రానున్న ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, బుర్ర రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు