కార్పొరేషన్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 23వ డివిజన్ (సుభాష్‌నగర్)లో గల పోచమ్మ ఆలయ ఆవరణలో బోర్, ప్రహరీ నిర్మాణం, ఇతర పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, పోచమ్మ తల్లి తెలంగాణ ప్రజల ఇలవేల్పు అని, ప్రజలంతా గ్రామ దేవతగా కొలుచుకుంటారని పేరొన్నారు. నగరంలోని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు మంచి నీటి వసతి కల్పిస్తున్నట్లు పేరొన్నారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటూ నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నగర మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, నగరంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో అన్ని డివిజన్లకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ అర్ష కిరణ్మయి-మల్లేశం, కార్పొరేటర్లు, నాయకులు మేచినేని అశోక్‌రావు, పిట్టల రవీందర్, సూర్యశేఖర్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.