పెగడపల్లి/గొల్లపల్లి/వెల్గటూర్, జూలై 10: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందునా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సం క్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించా రు. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. పెగడపల్లి మండ లం లింగాపూర్‌లోని పెద్ద చెరువును భారీ వర్షంలోనే పరిశీలించారు.
చెరువులోకి భారీగా వరద వస్తుండడంతో ఎలాంటి ప్రమాదం తలెత్తకుం డా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట, తూములు, మత్తడి వద్ద నీరు లీకవుతు న్నదని, దీని వల్ల కట్ట తెగిపోయే ప్రమాదం ఉం దని, అలాగే ఎస్సారెస్పీ కాలువ నీళ్లు నేరుగా చెరువులోకి వచ్చేలా ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా మరమ్మతు పనులు చేపడతామని, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేష న్ డీఈ రమేశ్‌ను ఆదేశించారు. లింగాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు గానూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెరువు వద్ద నుంచే ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డికి మంత్రి ఫోన్ చేసి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాలు ఎక్కువగా పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా చెరువులు, కుంటలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగాపూర్ చెరువుకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను వెంటనే చేయించేలా చర్యలు తీసుకుంటామ న్నారు. గ్రామస్తులు ఆందోళన చెందవద్దని సూ చించారు. అనంతరం వెల్గటూర్ మండలం కప్పారావుపేటలో చెగ్యాం చౌరస్తా నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు గల ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. చెగ్యాం చౌరస్తా నుంచి ప్ర భుత్వ పాఠశాల వరకు మెయిన్ డ్రైనేజీ నిర్మిం చాలని అధికారులను ఆదేశించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం..
అద్దె భవనంలో కొనసాగుతున్న గొల్లపల్లి సం క్షేమ గురుకుల పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థు లు ఉంటున్న గదుల్లోకి నీరు వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి స్కూల్‌ను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా వసతులను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అంతకుముందు మంత్రి ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలను సందర్శించిన ఆర్డీవో, అధికారులు విద్యార్థులను గొల్లపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌కు తరలించారు.
అనంతరం మం త్రి తెలంగాణ మోడల్ హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను రెండ్రోజుల్లో ధర్మపురి మండ లం మగ్గిడిలో గొల్లపల్లి గురుకుల పాఠశాలకు మా ర్చేందుకు ఉన్న వసతులను సమీక్షించేందుకు అక్కడికి వెళ్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభు త్వం స్కూళ్లకు మూడు రోజుల సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవులు ముగిసేలోగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఇండ్లకు పంపించాలని, దూరంగా ఉన్న విద్యార్థులను గొల్లపల్లి మోడల్ స్కూల్లో వారికి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గొల్లపల్లి సంక్షేమ గురుకుల పాఠశాల కొనసాగుతున్న భవనం ప్రహరీ కూలడానికి కారణమైన వరద వెళ్లిపోయేలా కా లువలను శుభ్రం చేయించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అక్కడినుంచి మగ్గిడిలో ఉన్న అద్దె భవనంలో కొనసాగుతున్న వసతులను పరిశీలించేందుకు మంత్రి ధర్మపురి వెళ్లారు. అనంతరం ధర్మపురి వద్ద గో దావరి ఉధృతిని పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సత్త మ్మ, జడ్పీటీసీ జలేంధర్, ఎంపీపీ చిట్టిబాబు, వైస్ ఎంపీపీలు సత్తయ్య, గాజుల గంగాధర్, నంచర్ల విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్లు తిరుపతి నాయక్, పత్తిపాక వెంకటేశ్, రాజేశ్, వైస్ చైర్మన్ సునిల్, సర్పంచులు ఈరెల్లి శంకర్, కరుణాకర్‌రెడ్డి, లక్ష్మణ్, దావుల నీల లక్ష్మణ్, బాలసాని రవి, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి-సత్యం, తాసీల్దార్ కృష్ణచైతన్య, సీఐ రమణమూర్తి, ఎస్ఐ శ్వేత, ఏఈ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమేశ్, మల్లారెడ్డి, సింహాచలం జగన్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాబు, పట్టణాధ్యక్షుడు జలంధర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఎంపీపీలు సత్తయ్య, రాంచంద్రం, నేతలు రాం చందర్‌రెడ్డి, రవీందర్, గుర్రం మల్లారెడ్డి, తిర్మణి నర్సింహారెడ్డి, కాశెట్టి వీరేశం, మడిగెల తిరుపతి, బొడ్డు శంకరయ్య, నేరెళ్ల గంగాధర్, బొమ్మెన స్వామి, ఎండీ షకీల్, నునుగొండ మోహన్, బోగ లక్ష్మీనారాయణ, చెనాళ్ల అరుణ్, బోధనపు రెడ్డి, టేల రాజయ్య, భూమయ్య, రామస్వామి, బిడారి తిరుపతి, భానేశ్, ఎండీ రహీం, పడిదం వెంకటేశ్, భరత్, నాయకులు తదితరులు ఉన్నారు.