కరీంనగర్‌రూరల్: ఫిబ్రవరి 23: దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బల్మూరి ఆనందరావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ మండలం దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బల్మూరి ఆనందరావు అధ్యక్షతన జరిగింది. ఏప్రిల్ 2021 నుంచి 10 ఫిబ్రవరి 2022 వరకు సంఘం జమా, ఖర్చుల ఆమోదం, 2020- 2021 ఆడిట్ రిపోర్టు, 2022-2023 వార్షిక అంచనా బడ్జెట్, సంఘం పరిధిలోని నాబార్డు నిధుల ద్వారా 100 ఎంటీఎస్ గోదాం నిర్మాణ పనుల ఆమోదంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు ఊరడి శివారెడ్డి, బాషవేణి మల్లేశ్‌యాదవ్ సొసైటీ లావాదేవీలపై వివరాలు అడిగారు. కొత్త రైతుల సభ్యత్వంపై నిలదీశారు. పెట్రోల్ బంక్, వాటా ధనంపై డివిడెంట్ అందించాలని కోరారు. ఎరువుల గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్ ఎంపీపీ వేల్పుల నారాయణ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్‌పై నిలదీశారు. పెట్రోల్ బంకులో ప్రత్యేకంగా జనరేట్ ఏర్పాటు చేయాలని గోపాల్పూర్ ఉపసర్పంచ్ ఆరె కాంత్ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎరువుల గోల్‌మాల్‌పై సీఈవోను సస్పెండ్ చేశామని, దీర్ఘకాలిక రుణాలకు కొత్తపద్ధతి తీసుకువచ్చామని, భూమిలేని వారికి సభ్యత్వం ఇవ్వబోమని,496 మంది రైతులకు వాహనాల లోన్ రూ. 27 లక్షల 32 వేలు అందించారని, సొసైటీ అవకతవకలపై ఆడిట్ జరుగుతుందని వివరించారు. పెట్రోల్ బంక్‌లో జనరేటర్ ఏర్పాటు చేస్తామని, మంత్రి సహకారంతో ధాన్యం కొనుగో కోసం రూ. 10 కోట్లు మంజూరు చేయించి, 68 మందికి కోటి రూపాయలు చెల్లించామని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు తోట తిరుపతి, గాజుల సారమ్మ, గాజుల అంజయ్య, సంకరి శేఖర్, ఎర్ర అంజమ్మ, కుంభం అంజలి, బిజిల్లి పోచాలు, కందుల రమేశ్‌గౌడ్, దాడి లచ్చయ్య, వేల్పుల రమేశ్, గాండ్ల అంజయ్య, మేనేజర్ కృష్ణ, సీఈవో మనోజ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు మంద రాజమల్లు, మంద తిరుపతి, ఊరడి మల్లారెడ్డి, కొమురయ్య, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.