విష్వక్సేన్, సిమ్రాన్‌చౌదరి, నివేధా పేతురాజ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఈ సింగల్ చిన్నోడే.. న్యూ లవ్‌లో ఫ్రెషుగా పడ్డాడే..’ అంటూ సాగే గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను బెన్నీదయాల్ ఆలపించారు. రధన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను విష్వక్సేన్, సిమ్రాన్‌చౌదరి, మేఘాలేఖలపై తెరకెక్కించారు. విజయ్బిన్నీ కొరియోగ్రఫీ అందించారు. ‘సంగీతభరితప్రేమకథా చిత్రమిది. ప్రేమేలోకంగా బతికే ఓ యువకుడి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు నవ్విస్తూనే భావోద్వేగానికి లోనుచేస్తాయి. చిత్రీకరణ పూర్తయింది’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్.