శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 07, 2020 , 01:13:34

సహకార నామినేషన్లు షురూ..

సహకార  నామినేషన్లు షురూ..
  • తొలిరోజు మందకోడిగా ప్రారంభం
  • 55 సొసైటీలకు 156 నామినేషన్లు
  • ఉత్సాహం చూపుతున్న రైతులు

సహకార సంఘాల ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా ఉన్న 55 సొసైటీల పరిధిలో మొత్తం 156 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను సొసైటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు సంబంధిత ఎన్నికల అధికారులకు అందజేశారు. విండో డైరెక్టర్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా మంది రైతులు ఉత్సాహం చూపుతున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు శనివారం వరకు ఉండగా.. నేడు, రేపు నామినేషన్లు వేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. 

నమస్తే తెలంగాణ యంత్రాంగం : సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలయ్యింది. జిల్లాలో 55 సింగిల్‌ విండోలు ఉండగా.. తొలిరోజు గురువారం పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. మొదటిరోజు మొత్తం 156 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా సహకార అధికారిణి మమత తెలిపారు. జిల్లాలోని వివిధ సొసైటీల్లో దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.    
logo