బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 03, 2020 , 01:31:22

‘సహకార’ సందడి

‘సహకార’ సందడి
  • నేడు నోటిఫికేషన్‌ విడుదల
  • రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కం
  • ఈ నెల15న ఎన్నికలు
  • జిల్లాలో మొత్తం 55 సహకార సంఘాలు
  • సొసైటీకి ఒక ఎన్నికల అధికారి

ఆశావహుల్లో ఉత్సాహం

సహకార ఎన్నికల్లో పోటీ చేసి పదవులు అధిరోహించాలని ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది.  సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సహకార ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధమవుతున్నారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు సహకార సంఘాల ఎన్నికల ప్రకటనతో పల్లెలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే గ్రామాల్లో సహకార సంఘాల్లో ఓటర్లుగా ఉన్న రైతులను కలుసుకుంటున్నారు.  రైతులు, రైతు నాయకులు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులంతా సొసైటీ పదవులపై దృష్టి సారించారు. సొసైటీ చైర్మన్‌ పదవులతో పాటుగా డీసీసీబీ డైరెక్టర్లుగా పదవులను దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. 


రిజర్వేషన్లపై ఉత్కంఠ

సహకార సంఘాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. కాగా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లు ఉంటారు. ఇందులో ఎస్సీ మహిళ, ఓసీ మ హిళ, ఎస్టీ జనరల్‌, ఎస్సీ జనరల్‌ నుంచి ఒక్కరేసి చొప్పున, ఇద్దరిని బీసీ జనరల్‌ నుంచి, మిగిలిన ఏడుగురిని జనరల్‌ విభాగం నుంచి డైరెక్టర్ల్‌గా ఎ న్నుకుంటారు. ఇదంత జరగాలంటే ఏ విభాగానికి చెందిన ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంటుంది. అప్పుడే రిజర్వేషన్ల ఖరారు సాధ్యపడుతుంది. ఇదంతా పూర్తి కావడానికి అధికారులు రా త్రింబవళ్లు కష్టపడి ప్రక్రియను పూర్తి చేయానున్నా రు. పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేన్లు తమకు అనుకూలంగా వస్తాయోలేదోననిఆందోళనలో ఉన్నారు.  


బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు 

సహకార ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానంలోనే ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అయితే ఓటర్లను గుర్తించేదు కు అధికారులు ఫొటో ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. ఓటేసే సమయంలో ఫొటో ఓటర్‌స్లిప్‌తో పాటు సాధారణ ఓటరు కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. 


logo
>>>>>>