e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జయశంకర్ డ్రైవింగ్‌లో శిక్షణ

డ్రైవింగ్‌లో శిక్షణ

భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ట్రైనింగ్‌ సెంటర్‌
ఆదాయం పెంచుకునే దిశగా సంస్థ అడుగులు
డిపోలో థియరీ తరగతులకు ప్రత్యేక గది
శిక్షణకు సిద్ధమైన బస్సు
హెవీ ఎంవీ లర్నింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారు

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 22 : ఆదాయం పెం చుకునే దిశగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. సమ్మె అ నంతరం సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సంస్థపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగా కార్గో, పార్సిల్‌ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రీజియన్‌లోని పలు డిపోల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారం భం కాగా భూపాలపల్లి డిపోలో శిక్షణకు రంగం సిద్ధం చేశారు. ఆసక్తి గల వారికి భారీ వాహనాలు నడపడం లో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రమాదాల నివారణ, ఇంధనం ఆదా చేయడంలో పాటించాల్సిన మెళకువలు నేర్పిస్తారు. ఇందుకోసం డిపోలో హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. శిక్షణలో థియరీ, ప్రాక్టికల్‌ తరగతులు ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. డ్రైవింగ్‌ నేర్పించేందుకు బస్సును తీర్చిదిద్దారు. నెల రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఆర్టీసీ సంస్థ అందించే శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావించిన యువకులు శిక్షణకు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు.

- Advertisement -

ఉత్తమ శిక్షణ
ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి పలు రకా ల ప్రయోజనాలు ఉంటాయి. శిక్షణ పొందాలనుకునే వారు రూ. 15,600 చెల్లించాలి. డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకునే వారు 20 ఏండ్లు నిండి ఎల్‌ఎంవీ లైసెన్స్‌ ఏడాది అనుభవంతో పాటు హెవీ మోటార్‌ వెహికిల్‌ లర్నింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. అదనంగా డబ్బులు చెల్లించేవారికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు. సంస్థలో నిష్ణాతులైన వారితో డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పిస్తారు. భారీ వాహనాలు నడపడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, వాహనం రిపేరు చేయడం, ఇంధనాన్ని ఆదా చేయడం, జాతీయ రహదారులపై వాహనాలను నడపడం, ప్రమాదాలు జరుగకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలు నేర్పిస్తారు. శిక్షణ పొందిన వా రు రవాణా శాఖ కార్యాలయం నుంచి హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు ఆర్టీసీ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారు.

శిక్షణ చాలా ఉపయోగకరం..
ఆర్టీసీ ఆధ్వర్యంలో భారీ వాహనాలు నడపడంలో ఇస్తున్న శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనుభవం గల డ్రైవర్లు, ఇతర సిబ్బంది నెల రోజుల పాటు యువకులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో థియరీ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ కోసం ప్రత్యేకంగా బస్సును తయారు చేశాం. డ్రైవింగ్‌కు డిమాండ్‌ ఉన్న ఈ పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలి.

  • భూక్యా ధరమ్‌ సింగ్‌,భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement