Vikramarkudu 2 | రెండు బ్లాక్ బస్టర్ సీక్వెల్స్‌కు కథ సిద్ధం చేసిన విజయేంద్రప్రసాద్
Bajrangi Bhaijaan 2 | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ‘రుస్లాన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్‌శర్మ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశ్రీ మిశ్రా కథానాయికగా నటిస్తుంది. కరణ్.బి దర్శకత్వం వహిస్తున్నారు
Bajrangi Bhaijaan 2 | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ‘రుస్లాన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్‌శర్మ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశ్రీ మిశ్రా కథానాయికగా నటిస్తుంది. కరణ్.బి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ సినిమాలకు కథ సిద్ధమైందని త్వరలోనే నటినటుల ఎంపిక ఉంటుందని అది అవ్వగానే షూటింగ్ మొదలుపెడతామని తెలిపాడు. అలాగే హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘బజరంగీ భాయ్‌జాన్’ సినిమాకు కూడా సీక్వెల్ రెడీ అయ్యిందని త్వరలోనే సల్మాన్ ఖాన్ కలిసి మరిన్ని వివరాలను వెల్లడిస్తానని విజయేంద్రప్రసాద్ వెల్లడించాడు. అయితే ఈ వార్త విన్న సల్మాన్ ఖాన్, రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

