శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 06, 2021 , 01:24:18

జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలి

జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలి

  • కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి రూరల్‌, ఫిబ్రవరి 5 : జనాభా ప్రాతిపదికన స్వయం ఉపాధి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అ ధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమ ల కేంద్రం ద్వారా వాహనాలు, సేవా రంగాల్లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్లను అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ దరఖాస్తుదారుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కులాల్లోని అన్ని ఉపకులాల వారికి సమానంగా లబ్ధిచేకూరేలా దరఖాస్తులను పరిశీలించి కమిటీ ముందుంచాలన్నా రు. సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రైవేట్‌ బ్యాంకులకు బదులు ప్రభుత్వ బ్యాంకులను ఎంపిక చేయాలని అన్నారు. ఎల్డీఎం శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్‌,  జిల్లా మేనేజర్‌ రాఘవేందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధాని మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo