శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 30, 2021 , 01:02:21

పట్టణ ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పట్టణ ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

భూపాలపల్లి రూరల్‌, జనవరి 29: భూపాలపల్లి మున్సిపాలిటీలో వార్డుల వారీగా పారిశుధ్య కార్మికులను కేటాయించి తడి, పొడి చెత్తను ప్రతి రోజూ సేకరించాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులతో పట్టణ ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నెలా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పచ్చదనం పెంపొందించేందుకు రెగ్యులర్‌గా నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడకుండా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పన్నుల వసూలులో మున్సిపాలిటీ వెనుకబడి ఉన్నందున వెంటనే ఆయా వార్డుల్లో బిల్‌ కలెక్టర్లను బాధ్యులుగా చేస్తూ 100 శాతం పన్నులను వసూలు చేయించాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వ్యాపారుల లైసెన్సులు పరిశీలించాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, టీపీడీవో అవినాష్‌, ఏఈ రాజన్న, టెక్నికల్‌ అధికారి మానస, మున్సిపల్‌ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్‌, రజిత, బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు ఎంఆర్‌పీఎస్‌ సభ్యుల వినతి

ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.  అనంతరం కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి రేణుకుంట్ల కొంరయ్య, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎలుకటి రాజయ్య, రాజేందర్‌, మహేశ్‌, పుల్ల సతీశ్‌, మేకల శంకర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo