కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టండి

భూపాలపల్లి రూరల్/ములుగుటౌన్, జనవరి 5: అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న వారి జాబితాను రూపొందించి వెంటనే నియామక ప్రక్రియను ఈనెల చివరిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగోన్నతి, కారుణ్య నియామకాలు, పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 3 నెలల పనులకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని అన్నారు. మండలాల వారీగా మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సహకారంతో పల్లెప్రగతి పనులను జిల్లాలో మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, డీఆర్డీవో శైలజ, జడ్పీ సీఈవో నాగ పద్మజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ములుగులో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీపీవో వెంకయ్య, కలెక్టరేట్ ఏవో శ్యామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ సోమేశ్ కుమార్
తాజావార్తలు
- 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు