శనివారం 06 మార్చి 2021
Jayashankar - Dec 14, 2020 , 05:33:34

స్వరాష్ట్రంలో సౌకర్యవంతమైన క్వార్టర్లు

స్వరాష్ట్రంలో సౌకర్యవంతమైన క్వార్టర్లు

  •  భూపాలపల్లి ఏరియాలో  రూ.166.22 కోట్ల వ్యయంతో 994  డబుల్‌బెడ్‌రూం క్వార్టర్లు నిర్మాణం
  •  హర్షం వ్యక్తంచేస్తున్న కార్మికులు 

భూపాలపల్లి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన త ర్వాత సింగరేణి యాజమాన్యం కార్మికులకు సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల్లో 994 డబుల్‌ బెడ్‌రూం క్వార్టర్ల ని ర్మాణం చేపట్టింది. ఇందుకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. నిర్మా ణ సంస్థ పనులను ప్రారంభించి చకచకా చేస్తున్నది.  ఏరియా లో మొదటిసారి డబుల్‌ బె డ్‌రూం క్వార్టర్లు నిర్మిస్తుండడంతో కార్మికుల్లో ఆనం దం వ్యక్తమవుతోంది. 

రూ.166.22 కోట్ల వ్యయంతో..

భూపాలపల్లి ఏరియాలో రూ.166.22 కోట్ల వ్యయం తో అన్ని సౌకర్యాలతో 994 డబుల్‌ బెడ్‌రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. ఈ నిధుల్లోనే మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. క్వార్టర్ల సముదాయా ల చుట్టూ ప్రహరీ చేపట్టనున్నది. ఇదిలా ఉండగా యైటిైంక్లెన్‌ కాలనీలో అత్యాధునిక వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్‌, సూపర్‌ బజార్లు ఈ నిర్మాణాలకు అందుబాటులో ఉన్నాయి. మిలినీయం క్వార్టర్ల సముదాయంలో ఉన్న సూపర్‌ బజార్‌, సమీపంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌ నూతనంగా నిర్మిం చే 140 క్వార్టర్లలో ఉండే  కార్మికుల కుటుంబాలు వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేఎల్‌ పీ రహదారిలో నిర్మిస్తున్న 854 క్వార్టర్లలో తాగునీటి వసతి కోసం అదనపు నిధులు కేటాయించి 1మిలియన్‌ లీటర్ల సా మర్థ్యం ఉన్న వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించాలని సంస్థ తలపెట్టింది. అవసరమైన ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. 

రెండు ప్రాంతాల్లో క్వార్టర్ల నిర్మాణం

సింగరేణి యాజమాన్యం రెండు ప్రాంతాల్లో క్వార్టర్ల నిర్మాణం చేపట్టిం ది. ఇందులో కేఎల్‌పీ రహదారి సమీపంలో ఉన్న 55 ఎకరాల్లో 854 (61బ్లాకులు)క్వార్టర్ల నిర్మాణ పనులను అక్టోబర్‌ 31న నిర్మాణ సంస్థ అధికారికంగా పనులను ప్రారంభించింది. మరో 140 క్వార్టర్ల (10 బ్లాకులను) భూపాలపల్లి ఏరియా సింగరేణి మిలీనియం క్వార్టర్ల సముదాయం సమీపంలో ఉన్న 6.20 ఎకరాల్లో నిర్మించనుంది. ఇక్కడ కూడా మూడు చోట్ల క్వార్టర్ల నిర్మాణం జరుగనున్నది. ఇందులో ఒక చోట రెండెకరాలు, మరోచోట రెండెకరాలు, ఇంకోచోట 2.20 ఎకరాల్లో ఈ 140 క్వార్టర్ల నిర్మాణం సింగరేణి సంస్థ చేపట్టనున్నది. ఒక్కో బ్లాకులో 14 క్వార్టర్ల చొప్పున 71 బ్లాకుల్లో 994 క్వార్టర్ల నిర్మాణం జరుగనుంది. నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడితే రెండేళ్ల వరకు సంబంధిత నిర్మాణ సంస్థ మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుంది. 

రెండు కాలనీల సముదాయాలకు ఎస్‌టీపీ

మంజూర్‌నగర్‌లో సమీపంలో ఉన్న యైటిైంక్లెన్‌ కాలనీ సముదాయం, కేఎల్‌పీ రహదారి సమీపంలో నిర్మిస్తున్న  854 క్వార్టర్ల సముదాయానికి సంబంధించి మలమూత్ర వ్య ర్థాలు శుద్ధిచేసి బయటకు పంపడానికి ఎస్‌టీపీ(సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)ను నిర్మించనున్నారు. అదనపు నిధులతో దీని ని నిర్మించేందుకు సింగరేణి సన్నద్ధమవుతోంది.

15 నెలల్లో పూర్తి

994 క్వార్టర్ల నిర్మాణం, మౌలిక వసుతుల పనులను నిర్మాణ సంస్థ 15 నెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. ఈ సంవత్సరం ఆగస్టులోనే సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో 994 క్వార్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపి, ఆగస్టు 7న టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశారు. కేపీసీ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. మొదట కేఎల్‌పీ రహదారి సమీపంలో క్వార్టర్ల నిర్మాణ పనులను చేపట్టి వేగవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు 15 బ్లాకుల్లో 210 క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి పిల్లర్లు వేయడానికి గుంతలను తవ్వారు. పునాది నిర్మించే పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యే గండ్ర  వెంకటరమణారెడ్డి కృషి ఫలితం

కార్మికుల కష్టాలు, భవిష్యత్‌లో నూతన బొగ్గు గనులు వస్తున్న దృష్ట్యా ఇక్కడ మరో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్‌ను పలుమార్లు కలిసి విన్నవించారు. ఇందుకు స్పందించిన ఆయన 994 క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. దీంతో క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. 


VIDEOS

logo