సోమవారం 08 మార్చి 2021
Jangaon - Feb 20, 2021 , 02:06:49

గ్రంథాలయ పన్నును సకాలంలో చెల్లించాలి

గ్రంథాలయ పన్నును  సకాలంలో చెల్లించాలి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 19 : గ్రంథాలయ పన్నును గ్రామపంచా యతీలు సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధికి సహకరించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా గ్రం థాలయ సంస్థ 2021-22 వార్షిక బడ్జెట్‌ అంచనా రూపొందించి సంచాల కులకు పరిపాలన ఆమోదం నిమిత్తం చర్చించామన్నారు. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు సంస్థ పరిధిలోని గ్రంథాలయాలకు ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్‌ మ్యా చింగ్‌, నాన్‌ మ్యాచింగ్‌ పథకాల్లో గ్రాంట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. జిల్లాలోని కొన్ని జీపీల నుంచి లైబ్రరీ సెస్‌ రావడంలేదన్నారు. జీపీల నుంచి 8 శా తం సెస్‌ వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణారెడ్డి అధికారులను కోరారు. ఈ సమావేశంలో డివిజనల్‌ పంచాయతీ అధికారి గంగా భవాని, గ్రంథాలయ కార్యదర్శి శ్రీలత, సభ్యులు దామెర రవి కుమార్‌, కారుపోతుల భిక్షపతి, వడ్డాలపు రమ్య తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo