Jangaon
- Jan 09, 2021 , 01:58:32
VIDEOS
ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి

జనగామ రూరల్, జనవరి8: రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉన్నా మొక్కలు నాటేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో శుక్రవారం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, సర్పంచ్ సానబోయిన శ్రీనివాస్, ప్లాటేంషన్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో బిరుదు హిమబిందు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, ఎంపీటీసీ బొల్లం బాల సిద్దులు, ఎంపీవో ఉప్పుగల్లు సంపత్ కుమార్, ఏపీవో భిక్షపతి పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING