ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 30, 2020 , 00:49:54

ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

జనగామ క్రైం, డిసెంబర్‌ 29 : జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆమె ఈఆర్వోల స్థాయిలో కొనసాగుతున్న ఎలక్టోరల్‌ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పుల కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి దరఖాస్తును ఆమోదం లేదా తిరస్కరణకు ముందు అన్ని విధాలుగా విచారణ చేయాలన్నారు. జిల్లాలో ఫామ్‌-6 కింద 1,876, ఫామ్‌-7లో 5,640, ఫామ్‌-8లో 491, ఫామ్‌-8 ఏలో 28 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొత్తగా ఓటరు నమోదు, మరణించిన, వలసలు వెళ్లిన వారి పేర్ల తొలగింపు తదితర మార్పులు చేర్పులు నిబంధనలకు మేరకు చేయాలన్నారు. బూత్‌ లెవల్‌ అధికారి నుంచి ఏఈఆర్వో, ఈఆర్వో, డీఈవో స్థాయి వరకు అన్ని స్థాయిల్లో తనిఖీ చేయాలన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 857 పోలీంగ్‌ కేంద్రాలున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఆర్వో మాలతి, ఆర్డీవో మధుమోహన్‌, తహసీల్దార్‌ రవీందర్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ ఏతేషామ్‌ అలీ పాల్గొన్నారు.

VIDEOS

logo