ఆదివారం 24 జనవరి 2021
Jangaon - Dec 04, 2020 , 04:15:33

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా ముసాయిదా

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా ముసాయిదా

  • ఈనెల 31 వరకు ఓటరు నమోదుకు మరో ఛాన్స్‌

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 3: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కే నిఖిల విడుదల చేశారు. ఎన్నికకు జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 19,422 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ముసాయిదా జాబితాలో పట్టభద్రులు తమ పేరు, వివరాలను సరి చూసుకోవాలని, ఏమైనా మార్పులు, ఉంటే సరి చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు నమోదుకు ఈనెల 31 వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు. logo