గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 20, 2020 , 03:02:06

చంపక్‌హిల్స్‌ డంపింగ్‌ యార్డుకు రూ.1.28 కోట్లు

చంపక్‌హిల్స్‌ డంపింగ్‌ యార్డుకు రూ.1.28 కోట్లు

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున
  •  ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్‌ 19 : చంపక్‌హిల్స్‌పై ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌ యార్డును 1.28 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున తెలిపారు. జనగామ పట్టణంలోని 30 వార్డుల్లో పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ సేకరిస్తున్న తడి, పొడి చెత్తను నిల్వచేసి సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద కంపోస్టు ఎరువుగా మార్చేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. గురువారం చంపక్‌హిల్స్‌పై మున్సిపల్‌కు కేటాయించి 10ఎకరాల స్థలం చుట్టూ రూ.74 లక్షలతో ప్రహరీ నిర్మాణం, సిద్ధిపేట-జనగామ ప్రధాన రహదారి నుంచి యార్డు లోపలికి వెళ్లే దారిని రూ.54 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలు విస్తరిస్తూ జనాభా పెరుగుతుందన్నారు. దానికి తగినట్లుగా తడి, పొడి చెత్తను సేకరించి రోజూ డంపింగ్‌ యార్డుకు చేరవేయడం ద్వారా పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకుంటామన్నారు.

మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి జనగామ జిల్లా కేంద్రానికి సకల హంగులు సమకూర్చేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కమిషనర్‌ సమ్మయ్య, డీఈ రవీంద్రనాథ్‌, ఏఈ శాంతిస్వరూప్‌, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ తాళ్ల సురేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, అరవింద్‌రెడ్డి, పేర్ని స్వరూప, పాక రమ, గుర్రం భూలక్ష్మీనాగరాజు, బొట్ల శ్రీనివాస్‌, ఓబుల్‌కేశ్వాపూర్‌ సర్పంచ్‌ చేర్యాల రేణుక, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు నీల యాదగిరి, చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు పాల్గొన్నారు. 


VIDEOS

logo