శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 08, 2020 , 03:25:05

సీఎం కేసీఆర్‌ చలువతోనే బీడు భూములకు సాగునీరు

సీఎం కేసీఆర్‌ చలువతోనే బీడు భూములకు సాగునీరు

  •  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

బచ్చన్నపేట, నవంబర్‌ 7 : సీఎం కేసీఆర్‌ చలువతోనే జిల్లాలోని ఎగువ ప్రాంతాలు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తమ్మడపల్లి, బచ్చన్నపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బచ్చన్నపేట, చేర్యాల, జనగామ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. గోదావరి నదిపై తుపాకులగూడెం వద్ద ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతానికి సాగునీరందిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఈసారి గోదావరి జలాలు రాకుండా మోటర్లు నెలరోజుల పాటు నడువకుండా చేసిన ఎస్‌ఈ వైఖరిపై ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడనే మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రతి ఊరు చెరువులోకి కాల్వలు తవ్వించేలా కృషి చేస్తున్నామని అన్నారు. అవి పూర్తయితే ఏ రైతు పంట పొలాలు ఎండిపోకుండా గోదావరి జలాలు మళ్లించే వీలుంటుందన్నారు. పంటలకు గ్రామాల్లోనే మద్దతు కల్పించేలా రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, అదనపు జేసీ భాస్కర్‌రావు, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీఎస్‌వో రోజారాణి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మేకల కవితరాజు, ఎంపీటీసీ గుర్రాల లలితనర్సిరెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, అదనపు పీడీ నూరొద్దీన్‌, ఏపీఎం జ్యోతి, ఎంపీడీవో రఘురామకృష్ణ, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ అనిల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌, నాయకులు సంజీవరెడ్డి,  షబ్బీర్‌, నరేందర్‌, ఆంజనేయులు, మహేందర్‌రెడ్డి, ఆజాం, ఫిరోజ్‌, అరవింద్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ సిద్ధులు, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo