శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - May 31, 2020 , 03:11:37

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

జనగామ, మే 30 : వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ ప్రత్యేక కార్యదర్శి జీవన్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, జిల్లా రైతులు మాత్రమే విక్రయించాలన్నారు.  రైతుల పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో జనగామ వ్యవసాయ మార్కెట్‌లో సంప్రదించి ముందస్తు టోకెన్‌ తీసుకోవాలన్నారు. టోకెన్‌ తీసుకున్న రైతులు సూచించిన తేదీల్లో పత్తిని తీసుకురావాలన్నారు. 

VIDEOS

logo