ఆదివారం 07 మార్చి 2021
Jagityal - Jan 20, 2021 , 01:12:01

నిర్భయంగా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు

నిర్భయంగా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు,  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

మెట్‌పల్లి, జనవరి19: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రతి ఒక్కరూ నిర్భయంగా వేసుకోవచ్చని  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మంగళవారం మెట్‌పల్లి ప్రభుత్వ సామాజిక దవాఖానతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకాల పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ సామాజిక దవాఖాన సూపరిండెంట్‌ చైతన్యసుధ,  వైద్యులు అమరేశ్వర్‌, సాజిద్‌అహ్మద్‌తోపాటు ఏడుగురు డాక్టర్లు, 39 మంది సిబ్బందికి టీకాలు వేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ ప్రణయ్‌, ఆరోగ్య సిబ్బంది  టీకా వేయించుకున్నారు.  జిల్లా  వైద్యారోగ్య శాఖ అధికారి శ్రీధర్‌  వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కౌన్సిలర్లు, ఇన్‌చార్జి ఆర్డీవో వినోద్‌కుమార్‌, నాయకులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

మల్లాపూర్‌, జనవరి 19: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంభించారు. 81 మంది వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు టీకాలు తీసుకున్నట్లు వైద్యాధికారి రాకేశ్‌కుమార్‌ తెలిపారు. ఆర్డీవో వినోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కదుర్క నర్సయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

మల్యాల, జనవరి 19 : మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. మండల వైద్యాధికారి లావణ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి టీకాను హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావు, తదుపరి ముత్యంపేట ఏఎన్‌ఎం అహల్యకు టీకాలు వేశారు. ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీ సభ్యుడు కొండపలుకుల రామ్మోహన్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్‌, ఏఎంసీ చైర్మన్‌ జనగం శ్రీనివాస్‌, మల్యాల, పోతారం, నూకపల్లి సహకార సంఘాల అధ్యక్షులు రాంలింగారెడ్డి, సాగర్‌రావు, మధుసూదన్‌రావు, నాయకులు కోటేశ్వర్‌రావు, రాజేందర్‌, భూపతిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo