సోమవారం 25 మే 2020
Jagityal - May 22, 2020 , 00:46:22

ముఖ్యమంత్రి నోట గాదెపల్లి మాట

ముఖ్యమంత్రి నోట గాదెపల్లి మాట

 నియంత్రిత సేద్యానికి గ్రామస్తుల మద్దతుపై అభినందన

 తీర్మానం స్ఫూర్తిదాయకమని కితాబు

జగిత్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ నోట ధర్మపురి మండలం గాదెపల్లి ప్రస్తావన వచ్చింది. నియంత్రిత సేద్యానికి గ్రామస్తులు మద్దతునిస్తూ తీర్మానించడం స్ఫూర్తివంతమైన నిర్ణయమని ముఖ్యమంత్రి అభినందించారు. నియంత్రిత సాగు విధానంపై హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయాధికారులు, ఆర్బీఎస్‌ కన్వీనర్లతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. రైతులను రాజులను చేసే క్రమంలో తీసుకున్న నియంత్రిత సాగు విధానాన్ని అన్నదాతలు ఆదరిస్తారని, తెలంగాణ రైతులు చైతన్యవంతులని, వారికి ఏది మేలు చేస్తుందో.. ఏది నష్టం కలిగిస్తుందో తెలుసునన్నారు. గాదెపల్లి రైతుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసించగా, సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు.logo