సోమవారం 25 మే 2020
Jagityal - Apr 01, 2020 , 02:05:58

వలస జీవులకు సాయం

వలస జీవులకు సాయం

కరీంనగర్‌ జిల్లాలో 5,064 మందికి సాయం..

జిల్లాలో మొత్తం 14,355 మంది వలస కార్మికులు ఉండగా మంగళవారం 5,064 మందికి 60,408 కిలోల బియ్యం, 25,32,000 నగదు అందించారు. కరీంనగర్‌ డివిజన్‌లో 13,518 మందిని గుర్తించగా, కరీంనగర్‌ నియోజకవర్గంలో 336 మందికి 4,032 కిలోల బియ్యం, 1.83 లక్షల నగదు అందించారు. మానకొండూర్‌ నియోజకవర్గంలో 1,507 మందికి 18,084 కిలోల బియ్యం, 7,53,500 నగదు అందించారు. చొప్పదండి నియోజకవర్గంలో 2,461 మందికి 29,532 కిలోల బియ్యం, 12,30,500 నగదు అందించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని చిగురుమామి డి, సైదాపూర్‌ మండలాల్లో 241 మందికి 2,892 కిలోల బియ్యం, 1,20,500 నగదు ఇచ్చారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 489 మందికి 5,868 కిలోల బియ్యం, 2,44,500 నగదు అందించారు.

జగిత్యాల జిల్లాలో 9,200 మందికి.. 

జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 9,200 మంది కార్మికులను గుర్తించిన అధికారులు, వారికి 1,10,400 కిలోల బియ్యం, ఒకొక్కరికి 500 చొప్పున 46లక్షలను పంపిణీ చేశారు. ఇంకా మిగిలిన కార్మికుల ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ జీ రవి కథలాపూర్‌ మండలం తాండ్య్రాల, కథలాపూర్‌లో వలస కూలీలకు బియ్యం, నగదు అందజేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 247 మందికి.. 

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బోయినపల్లి/ కోనరావుపేట:  జిల్లాలో 4,998 మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో చాలా మంది ఆంధ్రా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ నుంచి వలస వచ్చినవారే. వారందరికీ 599 క్వింటాళ్ల బియ్యాన్ని, 24.99లక్షల నగదు పంపిణీ చే సేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం వరకు 247 మందికి 2,964కిలోల బియ్యం, లక్షా23వేల 530 అధికారులు అందజేశారు. కోనరావుపేట మండలం ధర్మారంలో 45మంది వలస కూలీలకు ప్రభుత్వం తరఫున బియ్యాన్ని, నగదును జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పంపిణీ చేశారు. మండలంలోని 629 మంది వలస కూలీలకు బియ్యం, నగదు అందిస్తున్నామని తెలిపారు. 

పెద్దపల్లిలో 15,962 మందికి..

జిల్లాలోని 20,253 మంది వలస కూలీలు, వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం, నగదు అందిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు 15,962 మందికి 191.544 క్వింటాళ్ల బియ్యం, 2,126 మందికి 10లక్షల 63వేలు అందజేశారు. కమాన్‌పూర్‌, రామగిరి మండలాల్లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం మండలం జ్యోతినగర్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. 

మంచిర్యాలలో 3,836 మందికి.. 

జిల్లాలో 3,836 మంది వలస కార్మికులను గుర్తించారు. వారిలో 1791 మందికి 12 కిలోల బియ్యం, 500 నగదు చొప్పున 214.92 క్వింటాళ్ల బియ్యం, 8,95,500 పంపిణీ చేశారు. బుధవారం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 2482 మందికి.. 

జిల్లావ్యాప్తంగా 2,482 మందిని గుర్తించారు. వీరందరికి 29.78 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 12.41లక్షలు అందించారు. జిల్లావ్యాప్తంగా బియ్యం, నగదు అందజేసినట్లు అదనపు కలెక్టర్‌ రాంబాబు తెలిపారు. 

చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె..

చొప్పదండి, నమసే తెలంగాణ/ఇల్లంతకుంట/కొడిమ్యాల/ బోయినపల్లి : చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గుమ్లాపూర్‌లో, బోయినపల్లి, కొడిమ్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో వలస కూలీలకు ప్రభుత్వం తరఫున బియ్యాన్ని, నగదును పంపిణీ చేశారు. నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించారు. క్లిష్టపరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. దొంగలమర్రి చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను ఆపి వాహనదారులతో మాట్లాడారు. అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. వలస కూలీలకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. అలాగే చొప్పదండిలో 28 మంది వలస కూలీలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ 12 కిలోల బియ్యం, 500 చొప్పున నగదు పంపిణీ చేశారు. 

మానకొండూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి..

శంకరపట్నం/ గన్నేరువరం/ ఇల్లంతకుంట: మానకొండూర్‌ ఎమ్యెల్యే రసమయి బాలకిషన్‌ ప్రభుత్వం తరఫున సాయం అందించారు. శంకరపట్నం, గన్నేరువరం మం డలాల్లోని పలు గ్రామాలు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌ సీవోఈ పాఠశాలతోపాటు ఇల్లంతకుంట మండలంలోని వలసకూలీలకు ప్రభుత్వం తరఫున బియ్యం, నగదును పంపిణీ చేశారు. మానకొండూర్‌ మండలంలోని ఖాదరగూడెం, పెద్దూర్‌పల్లి గ్రామాలకు వచ్చి న కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాలతోపాటు మానకొండూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా అన్ని చర్యలూ చేపట్టిందని పేర్కొన్నారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌ నితికాపంత్‌, హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల

మెట్‌పల్లి టౌన్‌/ కోరుట్ల టౌన్‌ : మెట్‌పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 62 మంది వలస కార్మికులకు 12 కిలోల చొ ప్పున బియ్యం, 500 చొప్పున నగదును, షిర్డీ సాయిబాబా ట్రస్ట్‌ తరఫున ఫులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే కోరుట్లకు చెందిన యువజన సంఘాల సమితి ప్రతినిధుల ఆధ్వర్వంలో సేకరించిన విరాళాలతో కొనుగోలు చేసిన నిత్యావసర వస్తువుల కిట్లను 250 మంది వలస కార్మికులకు తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో అందజేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. 

జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్‌

జగిత్యాల, నమసే తెలంగాణ : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ జాబితాపూర్‌ పరిధిలోని చంద్రకృష్ణ క్వారీలో పనిచేస్తున్న 53 మంది ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, 500చొప్పున అందజేశారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం గొప్పదని కొనియాడారు. జిల్లాకేంద్రంలోని లడ్డూఖాజా చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ముజాహిద్‌ పట్వారీ ఆధ్వర్యంలో వెయ్యి మాస్క్‌లను పంపిణీ చేశారు. 


logo