కీవ్: ఉక్రెయిన్పై సుదీర్ఘ డ్రోన్ల దాడికి రష్యా ప్లాన్ వేసిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తమ దేశాన్ని మానసికంగా నిర్వీర్యం చేసేందుకు రష్యా ఆ ప్లాన్ వేసిందన్నానరు. ఇరాన్లో తయారైన షాహీద్ డ్రోన్లతో తమపై దాడి చేసేందుకు రష్యా ప్రణాళికలు వేసినట్లు జెలెన్స్కీ అన్నారు. డోన్బాస్ ప్రాంతంలో రష్యా సైనికులపై దాడి చేసిన తర్వాత జెలెన్స్కీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. రష్యా ప్రణాళికల్ని తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఇరాన్లో తయారైన సుమారు 80 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని, వాటిని నేలకూల్చామని జెలెన్స్కీ తెలిపారు.