మాస్కో: రష్యాలో జరుగుతున్న ZAPAD-21 ఉమ్మడి వ్యూహాత్మక సైనిక విన్యాసాలను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమీక్షించారు. నోవ్గోరోడ్ ప్రాంతంలోని ములినో ట్రైనింగ్ గ్రౌండ్లో నిర్వహించిన ఆర్మీ విన్యాసాల్లో భారత్తో సహా పలు దేశాలు పాల్గొన్నాయి. భారత ఆర్మీకి చెందిన 200 మంది సిబ్బంది తమ పటిమను చాటారు. క్షిపణుల ప్రయోగం, ప్రత్యేక హెలీకాప్టర్ల ఆపరేషన్, నాగ రెజిమెంట్ రక్షణాత్మక విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ వీటిని ఎంతో ఆసక్తిగా వీక్షించారు. బహుళ దేశాల సైనిక విన్యాసమైన జపాడ్ 2021, ఈ నెల 16 వరకు కొనసాగుతుంది.
#WATCH A 200-personnel contingent of the Indian Army is participating in Exercise ZAPAD 2021, a multi-nation military exercise being held in Russia till 16th September
— ANI (@ANI) September 13, 2021
(Video source: Indian Army) pic.twitter.com/IJ6XLwO9jO