Yuan Wang 5 | భారత్ అభ్యంతరం తెలిపినా.. హంబన్‌తోట పోర్ట్‌కు చేరిన చైనా నౌక
Yuan Wang 5 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్‌తోట పోర్ట్‌కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో సాంకేతికంగా అత్యాధునికమైన నిఘా నౌక డాకింగ్‌పై అభ్యంతరం తెలిపింది. 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది.
శ్రీలంక అప్పు చెల్లించలేక హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్లకు తనఖా పెట్టినప్పటి నుంచి భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తోంది. చైనా నౌక ఆగస్టు వారం రోజుల పాటు హంబన్‌తోట ఓడరేవులో ఆగనున్నట్లు తెలుస్తున్నది. ఈ చైనీస్ నౌక యువాన్ వాంగ్-5 షిప్ బాలిస్టిక్ క్షిపణులు, ఉప్రగహాలను సైతం ట్రాక్ చేస్తుంది. ఈ క్రమంలో నౌకలోని ట్రాకింగ్ సిస్టమ్‌లు తీర ప్రాంతంలోని భారత భద్రతా మౌలిక సదుపాయాల గురించి సమాచారాన్ని సేకరించవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

