YouTuber | వ్యూస్ కోసం విమానాన్ని కూల్చిన యూట్యూబర్‌కు చిక్కులు : 20 ఏండ్లు జైలు శిక్ష విధించే ఛాన్స్
వ్యూస్ కోసం తన విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చిన యూట్యూబర్‌కు (YouTuber) 20 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు వెల్లడించారు.
న్యూయార్క్ : వ్యూస్ కోసం తన విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చిన యూట్యూబర్‌కు (YouTuber) 20 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఫెడరల్ విచారణను అడ్డుకోవాలని దాచిన నేరాన్ని ట్రెవర్ జాకబ్ (29) అంగీకరించాడు. అతడు చేసిన నేరానికి ఫెడరల్ ప్రిజన్లో గరిష్టంగా 20 ఏండ్ల జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. యూట్యూబర్ అప్లోడ్ చేసిన విమానం కూలిన వీడియోను ఏకంగా 30 లక్షల మంది వీక్షించారు. నిందిడుతు ట్రెవర్ జాకబ్ పైలట్ లైసెన్స్‌ను అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) రద్దు చేసింది.
కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్ట్‌లో 2021 డిసెంబర్లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిధిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు పేర్కొన్నారు. నా విమానాన్ని కూల్చివేశాను అనే టైటిల్‌తో కూడిన వైరల్ వీడియోలో సింగిల్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి బయటకు దూకిన జాకబ్ ప్యారాచూట్‌తో సేఫ్ ల్యాండ్ అయ్యాడు. విమానం అంతటా ఏర్పాటు చేసిన కెమెరాలు ప్లేన్ నియంత్రణ కోల్పోయి అడవిలోకి దిగడం చివరికి క్రాష్ ల్యాండింగ్ అవడాన్ని చూపాయి.
ఈ క్లిప్‌పై ఏవియేషన్ ఔత్సాహికులు మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్‌ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నంచలేదని సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు పలు ప్రదేశాలున్నా అలా చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు. విమానం కుప్పకూలగానే బయటపడిన యూట్యూబర్ విమాన శిధిలాలను ధ్వంసం చేశాడని ఎఫ్ఏఏ పేర్కొంది. నేరానికి పాల్పడిన యూట్యూబర్ జాకబ్‌కు కోర్టు త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది.
Read More
బీర్‌తో నడిచే బైక్ ఆవిష్కరణ : గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

