న్యూయార్క్, ఫిబ్రవరి 15: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై అమెరికన్ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల క్రితం తాను జన్మనిచ్చిన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘ఐదు నెలల క్రితం నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. నా బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. మా బిడ్డ గోప్యత, భద్రత కోసం ఈ విషయాన్ని ఇంతకుముందు బయటపెట్టలేదు.
నా బిడ్డ గోప్యతను మీడియా గౌరవించాలని కోరుతున్నా’ అంటూ క్లెయిర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనపై ఎలాన్ మస్క్ స్పందించలేదు. కాగా, ఎలాన్ మస్క్ గత 20 ఏండ్ల కాలంలో 12 మంది సంతానానికి జన్మనిచ్చారు.