ఇంకొన్ని రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఒంటెలకు గిరాకీ పెరిగింది. పవిత్ర రంజాన్ మాసం సమయంలో ఒంటెలను బలి ఇస్తుంటారు. సౌదీ అరేబియాలో కూడా రంజాన్ సమయంలో ఒంటెలకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒంటెను ఏకంగా 14 కోట్లకు అమ్మారు.
గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. సౌదీ అరేబియాలో ఈ ఖరీదైన ఒంటె కోసం వేలం నిర్వహించారు. వేలం ప్రారంభంలో ఈ ఒంటెకు 10.16 కోట్లు పలికింది. తర్వాత దాన్ని 7 మిలియన్ల సౌదీ రియాల్స్‌కు అంటే 14.23 కోట్ల రూపాయలకు అమ్మేశారు.
ఆ ఒంటెకు అంత ప్రాముఖ్యత ఎందుకంటే.. అన్ని ఒంటె జాతులలోనే అది చాలా అరుదైన జాతికి చెందిన ఒంటె అట. ప్రపంచంలోనే ఆ జాతికి చెందిన ఒంటెలు చాలా అరుదు. అందుకే.. దానికి అంత డిమాండ్ అన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒంటెగానూ అది రికార్డు క్రియేట్ చేసింది.
— مقاطع فيديو (@Yoyahegazy1) March 25, 2022