Gaza-Israel | గాజాపై బాంబుల దాడి పట్ల ఐసీజే సీరియస్.. మారణ హోమానికి పాల్పడొద్దని హెచ్చరిక..!
Gaza-Israel | గాజాలో మారణ హోమానికి పాల్పడవద్దని ఇజ్రాయెల్ ను నెదర్లాండ్స్ లోని ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఆదేశించింది.
Gaza-Israel | గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఐసీజే) తీవ్ర హెచ్చరికలు చేసింది. గాజాపై ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధంలో మారణ హోమం జరుగుతున్నదని, కాల్పుల విరమణకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఐసీజే) లో దక్షిణాఫ్రికా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నెదర్లాండ్స్‌లోని ఐసీజే విచారణ జరిపింది. గాజాలో మారణ హోమానికి దారి తీసేలా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా గాజా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐసీజే కీలక వ్యాఖ్యలు చేసింది. గాజాలో జరుగుతున్న మానవీయ విషాదం తీవ్రత మాకు తెలుసు. యుద్ధంలో పోతున్న ప్రజల ప్రాణాలు, ప్రజలు పడుతున్న కష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అని పేర్కొంది. కానీ కాల్పుల విరమణపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.
ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసిన దక్షిణాఫ్రికాపై ఇజ్రాయెల్ మండి పడింది. దక్షిణాఫ్రికా ఆరోపణలు అసత్యం అని, మొత్తం వాస్తవాలను వక్రీకరించిందని పేర్కొంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకూ 2,600 మంది పాలస్తీనా వాసులు మరణించారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన మెరుపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

