వాషింగ్టన్: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు(World Bank) అంచనా వేసింది. గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చివేసింది. అయితే ఈ ఏడాది దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బలంగా ఉందని, అది 6.0 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత్లో వృద్ధి జోరుగా ఉందని, ఇక పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లోనూ ఆశించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో రికవరీ ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సౌత్ ఏషియా డెవలప్మెంట్ రిపోర్టులో ఈ విషయాన్ని తెలిపారు. రాబోయే రెండేళ్లలో దక్షిణ ఆసియాలో ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. 2025 నాటి సౌత్ ఏషియాలో వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.