శనివారం 28 నవంబర్ 2020
International - Oct 21, 2020 , 10:49:28

అమెజాన్ ఉద్యోగుల‌కు జూన్ వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌

అమెజాన్ ఉద్యోగుల‌కు జూన్ వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌

హైద‌రాబాద్‌:  కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అమెజాన్ సంస్థ త‌న ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ను పెంచింది.  వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు ఇంటి నుంచి ప‌ని చేయ‌వ‌చ్చు అని పేర్కొన్న‌ది.  ఇంటి నుంచి  ప‌నిచేసే సౌల‌భ్యం ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. గ‌తంలో ఈ ఆఫర్‌ను జ‌న‌వ‌రి వ‌ర‌కు ఇచ్చిన అమెజాన్ సంస్థ‌.. ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని జూన్ 30 వ‌ర‌కు పెంచింది. అయితే అమెరికాలో సుమారు 19 వేల మంది అమెజాన్ వ‌ర్క‌ర్లకు క‌రోనా వైర‌స్ సోకిన నేప‌థ్యంలో ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకున్న‌ది. మైక్రోసాఫ్ట్‌, ట్విట్ట‌ర్ లాంటి టెకీ సంస్థ‌లు కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ కూడా వ‌చ్చే జూలై వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పెంచింది. గూగూల్ కూడా ఆఫీసులో అవ‌స‌రం లేని వారికి ఇంటి నుంచి ప‌ని చేసే సౌల‌భ్యాన్ని జూన్ వ‌ర‌కు పొడిగించింది.