వాషింగ్టన్, జూన్ 3: మైక్రోటియా (చెవి బాహ్య భాగం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం) సమస్యతో బాధపడుతున్న ఓ 20 ఏండ్ల అమెరికా యువతికి వైద్యులు 3డీ-బయోప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సజీవ కణాలతో చేసిన చెవిని అమర్చారు. యువతి శరీరంలోని కణాలతో ఈ చెవిని రూపొందించడం విశేషం. సజీవ కణాలతో ఇంప్లాంట్ చేసిన తొలి చెవి ఇదేనని వాళ్లు తెలిపారు.