వాషింగ్టన్: మళ్లీ ఆఫ్ఘనిస్థాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని భారత్, అమెరికాలతో సహా 12 దేశాలు తీర్మానించాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఆయా దేశాల ప్రతినిధులు గురువారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధ క్షేత్రంగా మారిన ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల నిరంతర దాడుల నేపథ్యంలో 12 దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని అమెరికా విదేశాంగశాఖ పేర్కొంది. ఆఫ్ఘన్లో శాంతి ప్రక్రియను వేగవంతం చేయాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాకు చెప్పారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో నానాటికి దిగజారుతున్న పరిస్థితిపై ఖతార్ నిర్వహించిన రీజన్ కాన్ఫరెన్స్లో నార్వే, తజకిస్థాన్, టర్కీ, టుర్కెమిస్థాన్ పాల్గొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన పద్దతులపై చర్చించాయి.