Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేని అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేని హాజరవుతారా.. ఇరాన్ ఏం చెప్పింది
Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని హాజరు గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని హాజరు గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే సందేహానికి ఇండియాలోని ఇరాన్ రాయబారి అయతొల్లా హకీం ఎలాహి స్పందించారు. ఖమేని అంత్యక్రియలకు ఆయన తనయుడు మొజ్తాబా హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్ వెళ్తూ.. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఖమేని అంత్యక్రియలకు ఆయన తనయుడు హాజరుకావడం లేదన్నాడు. ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని హతమయ్యాడు. ఆయన తనయుడు మొజ్తాబా ఖమేని తప్పించుకున్నాడు. అమెరికా దాడిలో గాయపడ్డ మొజ్తాబా.. రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తండ్రి, కుటుంబ సభ్యుల అంత్యక్రియలకైనా హాజరవుతారా అంటే లేదని ఇరాన్ చెబుతోంది. ఈ అంశంపై గురువారం అయతొల్లా హకీం ఎలాహి స్పందించారు. మొజ్తాబా భద్రత విషయంలో ఇరాన్ అధికారులు గ్యారెంటీ ఇవ్వలేకపోయారని, అందువల్ల ఖమేని హాజరు కావడం లేదన్నాడు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మొజ్తాబా బయటకు రావాలనుకుంటున్నారని, ప్రజలను కలవాలనుకుంటున్నారని.. అయితే, భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం ఆయనను బయటకు వెళ్లనీయడం లేదన్నాడు. ఆయనకు భద్రత కల్పించలేమని అధికారులు చెప్పినట్లు, ఆయన బయటకు రావడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నట్లు అయతొల్లా హకీం అన్నారు. ఖమేని అంత్యక్రియలకు ఇరాన్ అంతా సిద్ధం చేసిందన్నాడు. ఖమేని మరణం తమకు తీరని లోటని చెప్పాడు. ఖమేని అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

