Saima Wazed | షేక్ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎందుకంటే..!
Saima Wazed | షేక్ హసీనా కుమార్తె (Sheikh Hasina daughter) సైమా వాజెద్ (Saima Wazed) ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైమా వాజెద్‌పై అవినీతి కేసులు (Curruption cases) నమోదుచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Saima Wazed : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాన మంత్రి (Former PM) షేక్ హసీనా కుమార్తె (Sheikh Hasina daughter) సైమా వాజెద్ (Saima Wazed) ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైమా వాజెద్‌పై అవినీతి కేసులు (Corruption cases) నమోదుచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్.. సైమాపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ తదితర అభియోగాలు మోపింది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది.
సైమా వాజెద్‌ను సెలవుపై పంపించి ఆమె స్థానంలో డాక్టర్ కేథరినా బోహ్మేకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది. సైమాను బాధ్యతల నుంచి తొలగించారా అన్న మీడియా ప్రశ్నకు.. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని మాత్రమే WHO చెప్పింది.
కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ కార్యాలయం ఢిల్లీలో ఉంది. అక్కడే విధులు నిర్వహించే సైమా వాజెద్ ప్రస్తుతం సెలవుపై వెళ్లారు. కాగా రిజర్వేషన్లకు సంబంధించి విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో షేక్ హసీనా అనూహ్య రీతిలో ప్రధాని పదవిని కోల్పోయారు. దాంతో గత ఏడాది ఆగస్టు 5 నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వం హసీనాపై హత్య సహా పలు అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైమా వాజెద్‌ను సెలవుపై పంపడం హసీనాకు షాక్ అనే చెప్పవచ్చు.
Read More >>
ముగ్గురు నూతన గవర్నర్ల నియామకం.. గోవా గవర్నర్‌గా..!
విజయ్ బేసిక్ పాలిటిక్స్ తెలుసుకోవాలి : డీఎంకే
హైదరాబాద్‌లో రన్నింగ్ బైక్‌పై ప్రేమజంట రొమాన్స్.. Video viral
వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం.. షాకింగ్ దృశ్యాలు
కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి సైనా నెహ్వాల్ ఫుల్స్టాప్..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

