వాషింగ్టన్: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై తమ దేశంలో నమోదైన కేసుపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని పేర్కొంది. ఈ కల్లోలం నుంచి బయటపడటానికి భారత్, అమెరికా మధ్య ఉన్న పటిష్ఠమైన సంబంధాలు సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ గౌతమ్ అదానీపై నమోదైన కేసుల గురించి బైడెన్ ప్రభుత్వానికి తెలుసని అన్నారు.
ఆస్ట్రేలియాలో అదానీ సంస్థపై జాతివివక్ష ఫిర్యాదు నమోదైంది. ఆ సంస్థకు చెందిన ఆస్ట్రేలియా బొగ్గు యూనిట్లో జాతి వివక్షను చూపుతున్నారంటూ ఆదివాసీ సంస్థ పౌర హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసి ంది. అదానీ కార్మైకేల్ బొగ్గు గనిలో ఆదివాసీల సాంస్కృతిక ఆచారాలను నిర్వహించడానికి, సాంస్కృతి పరిజ్ఞానాన్ని పంచుకోవడాన్ని గని నిర్వాహకులు అడ్డుకుంటున్నారని ఆదివాసీ సంస్థ ఆరోపించింది.