Donald Trump: ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం.. మరో విమానంలో దావస్కు డోనాల్డ్ ట్రంప్
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ ప్లేన్‌ను మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు. దావోస్‌లో జరుగుతున్న మీటింగ్‌కు ఆయన మరో విమానంలో వెళ్లనున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణించే విమానం వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరిగి వచ్చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌కు ఆయన వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానంలో బయలుదేరారు. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల తర్వాత ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ విమానంలో స్వల్ప స్థాయి ఎలక్ట్రిక్ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
సాంకేతిక సమస్య నేపథ్యంలో విమానాన్ని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివియెట్ తెలిపారు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విమానాన్ని వెనక్కి రప్పించినట్లు తెలిపారు. అయితే దావోస్ పర్యటన కోసం ట్రంప్ మరో ఎయిర్‌ఫోర్స్ విమానంలో వెళ్లనున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ లో భాగంగా దేశాధ్యక్షుడి ప్రయాణాల కోసం గత నాలుగు దశాబ్ధాల నుంచి నాలుగు విమానాలను వాడుతున్నారు. బోయింగ్ కంపెనీ ఆ విమానాలను మెయిన్టేన్ చేస్తున్నది.
ఇటీవల ఆ విమానాల్లో చాలా మార్పులు చేశారు. రేడియేషన్ షీల్డింగ్, యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఆ విమానాలకు జోడించారు. మిలిటరీతో టచ్‌లో ఉండేందుకు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఏర్పాటు చేశారు. ఖతార్‌కు చెందిన రాజ కుటుంబం ట్రంప్‌కు ఇటీవల బోయింగ్ 747-8 జంబో విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్ ఫ్లీట్‌లో జోడించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్లేన్కు మార్పులు చేస్తున్నారు.
After takeoff, the AF1 crew identified a minor electrical issue. Out of an abundance of caution, AF1 is returning to Joint Base Andrews. The President and team will board a different aircraft and continue on to Switzerland. https://t.co/pJ3Jc9NNbS
— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

