Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపుతోంది. ట్రంప్ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ కనిపించింది. సోమవారం ఓవెల్ ఆఫీస్ (Oval Office)లో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది. ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అనారోగ్యం వార్తల వేళ ట్రంప్ ‘అదృశ్యం’ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఏది చెప్పాలన్నా నిమిషాల్లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యే అధ్యక్షుడు.. రెండు రోజులుగా బాహ్యప్రపంచానికి కనిపించట్లేదు (no public appearances). ఎలాంటి మీడియా సమావేశాలనూ నిర్వహించట్లేదు. వారాంతంలో కూడా పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ‘అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమైంది..? ఆయన ఎక్కడ ఉన్నారు..? అసలు ఏం జరుగుతోంది?’ వంటి పోస్టులు నెట్టింట దర్శనమిస్తున్నాయి. కొందరు ‘ట్రంప్ చనిపోతే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో TRUMP IS DEAD ట్రెండింగ్‌లో ఉంది.
Trnding
అధ్యక్షుడి ఆరోగ్యంపై ఊహాగానాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్
మరోవైపు ట్రంప్ అనారోగ్యం వార్తల వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష (US President) బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. యూఎస్ఏ టుడేతో మాట్లాడిన జేడీ వాన్స్.. ట్రంప్ ఆరోగ్యంపై మాట్లాడారు. ‘అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవలే వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. అందులో వాస్తవం లేదు. ట్రంప్ ప్రస్తుతం ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ, వాటన్నింటినీ దాటుకొని తన పదవీ కాలాన్ని ట్రంప్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
Doctored Pictures | పోర్న్సైట్లో మహిళా ప్రధాని మార్ఫింగ్ ఫొటోలు.. ఆ దేశంలో తీవ్ర కలకలం
American Jewish Committee: ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా కారణం కాదు: అమెరికా యూదు కమిటీ
Ishaq Dar | భారత్‌తో చర్చలకు సిద్ధం.. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్