న్యూయార్క్: రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడం వల్లే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయగలుగుతోందని ఇటీవల అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవర్రో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే శ్వేతసౌధం సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను అమెరికా అమెరికా యూదు కమ్యూనిటీ(American Jewish Committee) ఖండించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా కారణం కాదు అని, భారత్, అమెరికా మధ్య బంధాన్ని మళ్లీ బలోపేతం చేయాలని యూద వర్గం పేర్కొన్నది.
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల పుతిన్‌కు ఇండియా నిధులు ఇచ్చినట్లు అవుతోందని, దాని వల్లే ఆ దేశం ఉక్రెయిన్‌తో పోరాడుతున్నట్లు శ్వేతసౌధ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో ఆరోపించారు. దీంతో అమెరికా, భారత్ మధ్య అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జువిష్ అడ్వకసీ గ్రూపు స్పందిస్తూ.. భారత్‌పై అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. భారత్ ప్రతిష్టను దిగజార్చే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు యూదు గ్రూపు ఆరోపించింది.
పుతిన్ యుద్ధ నేరాలకు భారత్‌ది బాధ్యత కాదు అని, అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నదని ఆ గ్రూపు తెలిపింది. విలువైన ఆ బంధాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని యూదు గ్రూపు పేర్కొన్నది.