చైనాలో కొత్త వైరస్.. ఏంటిది? మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా?
monkey b virus | మంకీ బి వైరస్ .. తాజాగా చైనాలో దీని కారణంగా తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఓ 53 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చనిపోయిన కోతులను ముట్టుకోవడం ద్వారా ఆయనకు ఈ వైరస్ సోకినట్లు తేలింది.

బీజింగ్: మంకీ బి వైరస్ (monkey b virus ).. తాజాగా చైనాలో దీని కారణంగా తొలి మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఓ 53 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చనిపోయిన కోతులను ముట్టుకోవడం ద్వారా ఆయనకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. నెల రోజుల తర్వాత కడుపులో వికారం, వాంతులు మొదలయ్యాయి. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా.. మే 27న ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ ఏంటి? ఇది ఎంత ప్రమాదకరం? మరో మహమ్మారిగా మారుతుందా అన్న అంశాలను ఒకసారి చూద్దాం.
ఏంటీ monkey b virus వైరస్?
ఇది కొత్తదేమీ కాదు. తొలిసారి ఈ బీ వైరస్ కారణంగా 1933లోనే ఓ లేబొరేటరీలో పని చేసే వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తిని ఓ కోతి కరిచింది. ఆ తర్వాత దానిని నుంచి కోలుకున్నా.. కొన్ని రోజుల తర్వాత జ్వర సంబంధమైన వ్యాధి బారిన పడ్డారు. మెల్లగా అసెండింగ్ మైలిటిస్ (నాఢీ సంబంధిత) వ్యాధి లక్షనాలు కనిపించి, 15 రోజుల తర్వాత మృత్యవాత పడ్డారు.
ఇది ఎలా వ్యాపిస్తుంది?
ఇది మనిషి నుంచి మనిషికి నేరుగా తాకడం, వైరస్ సోకిన వ్యక్తి స్రవాలు అవతలి వ్యక్తిలోకి వెళ్లడం ద్వారా సోకుతుంది. 1933లో తొలిసారి ఈ మాకాక్యూ బి ఇన్ఫెక్షన్ బయటపడిన తర్వాత ఇప్పటి వరకూ 20 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వీళ్లలో ఐదుగురు గత 12 ఏళ్లలోనే చనిపోయారు. వీళ్లలో చాలా మంది కోతి కరవడం లేదా గీరడం లేదా చర్మంపై ఏర్పడిన గాయం ద్వారా కోతి కణజాలం లేదా స్రవాలు శరీరంలోకి వెళ్లడం ద్వారా ఈ వైరస్ బారిన పడ్డారు.
ఈ వైరస్ ఎంత ప్రమాదకరం?
ఇది మనిషికి సోకినప్పుడు ప్రధానంగా కేంద్ర నాఢీ వ్యవస్థపైనే దాడి చేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. దీని బారిన పడి వాళ్లలో 70 నుంచి 80 శాతం మంది మరణించారు. వైరస్ సోకిన తర్వాత 1-3 వారాల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా ఫ్లు వైరస్ లక్షణాలైన జ్వరం, చలి, కండరాల నొప్పి, అలసట, తలనొప్పి కనిపిస్తాయి.
మహమ్మారిగా మారుతుందా?
ఆ అవకాశాలు చాలా తక్కువ అని ఈ వైరస్‌పై జరిగిన పరిశోధనలు తేల్చాయి. ఒక మనిషి నుంచి మరో మనిషికి అంత సులువుగా ఇది సోకదు. దీని కారణంగా దీని వ్యాప్తి వేగం తక్కువే. దీంతో ఇది మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువ అని తేలింది.
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టే వద్దంటున్న రాజద్రోహం చట్టంలో ఏముంది? సెక్షన్ 124Aను అసలెందుకు తీసుకొచ్చారు?
Sanjal Gavande : మన అమ్మాయిలు అమెరికాలోనూ అదరగొడుతున్నారు
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
పేదలకు అండగా.. ఒక్కడే 100 ఇండ్లు కట్టించి ఇచ్చాడు
వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు.. అదెలా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

