Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడు సుజీత్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే ‘బ్లడీ రోమియో’. డార్క్ యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడు సుజీత్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే ‘బ్లడీ రోమియో’. డార్క్ యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. బాలీవుడ్ నటుడు వివేక్ సిన్హా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాని హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’ చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో చిత్ర బృందం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ సిన్హా కూడా షూటింగ్లో పాల్గొన్నారని, సినిమాలో ఆయన ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.‘ధురంధర్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ సిన్హా ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన పాత్ర స్వభావం ఏమిటి? నాని పాత్రతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంటుంది? కథలో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నటీనటుల ఎంపికకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘బ్లడీ రోమియో’ను డార్క్ యాక్షన్ కామెడీగా రూపొందిస్తున్నారు. యాక్షన్‌తో పాటు వినోదాత్మక అంశాలు మిళితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు సుజీత్ గతంలో రూపొందించిన చిత్రాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు నానితో కలిసి ఆయన ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

