Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Sowcar Janaki | దివంగత సీనియర్ నటి షావుకారు జానకి కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె పెద్ద కుమార్తె యజ్ఞప్రభ (76) చెన్నైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు వీల్‌చైర్ నుంచి కిందపడిపోయారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. కిందపడిన తర్వాత తిరిగి లేవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Sowcar Janaki | దివంగత సీనియర్ నటి షావుకారు జానకి కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె పెద్ద కుమార్తె యజ్ఞప్రభ (76) చెన్నైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు వీల్‌చైర్ నుంచి కిందపడిపోయారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. కిందపడిన తర్వాత తిరిగి లేవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమె సాయం కోసం కేకలు వేసినా వెంటనే ఎవరూ స్పందించలేదు. చివరకు బంధువులకు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆమెను రక్షించారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. షావుకారు జానకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ చెన్నైలోని దురైపాక్కం ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె కాలికి శస్త్రచికిత్స జరగడంతో వీల్‌చైర్ సహాయంతో కదులుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె పిల్లలు అమెరికాలో నివసిస్తుండటంతో ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో యజ్ఞప్రభ వీల్‌చైర్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. కాలికి శస్త్రచికిత్స జరగడంతో ఆమెకు స్వయంగా పైకి లేవడం సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కిందపడిన తర్వాత యజ్ఞప్రభ సాయం కోసం గట్టిగా కేకలు వేసినప్పటికీ, ఇంటి తలుపులు మూసి ఉండటంతో బయట ఉన్నవారికి ఆమె పరిస్థితి తెలియలేదు. దీంతో కొంతసేపు ఆమె ఒంటరిగానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే, ఎలాగైనా సాయం పొందాలనే ప్రయత్నంలో ఆమె అతికష్టం మీద సెల్‌ఫోన్ వద్దకు చేరుకుని బంధువులకు సమాచారం అందించారు. ఆమె నుంచి సమాచారం అందుకున్న బంధువులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యజ్ఞప్రభ నివాసానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లేందుకు వీలుకాకపోవడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. అనంతరం కిందపడి లేవలేని స్థితిలో ఉన్న యజ్ఞప్రభను రక్షించారు.కాలికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె ఒంటరిగా ఉండటం ఈ ఘటనలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు ఫోన్ చేయగలగడంతో ఆమెకు సాయం అందింది.కాగా, ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

