Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Car Race : బ్రిటన్‌లో కారు రేస్‌లో పాల్గొని తల్లీకూతుళ్ల మృతికి కారణమైన ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులకు జైలుశిక్ష పడింది. నిందితులు జాస్కమల్ రియాత్‌కు 16 ఏళ్లు, హర్దీప్ బాచూకు 12 ఏళ్ల జైలుశిక్ష విధించారు.
లండన్: బ్రిటన్‌లో కారు రేస్(Car Race)లో పాల్గొని తల్లీకూతుళ్ల మృతికి కారణమైన ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులకు జైలుశిక్ష పడింది. ఆ ఇద్దరికీ కలిపి 28 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 2023 జనవరిలో రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ కేసులో జాస్కమల్ రియాత్, హర్దీప్ బాచూకు జైలుశిక్ష పడింది. రియాత్ వయసు 37 ఏళ్లు, హర్దీప్ 29 ఉన్నాడు. బాచూకు చెందిన ఆడీ టీటీ ఆర్ఎస్ కారు ఢీకొనడంతో స్కూల్‌కు వెళ్తున్న తల్లీకూతుళ్లు మృతిచెందారు. బాచూతో కలిసి రియాత్ కారు రేసులో పాల్గొన్నట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా తెలిసింది. రియాత్ బీఎండబ్ల్యూ ఎం135ఐ కారులో రేస్ చేశాడు.
నేరాన్ని అంగీకరించిన బాచూకు 12 ఏళ్ల జైలుశిక్ష పడింది. కానీ తన తప్పు లేదని వాదించిన రియాత్‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఇద్దరికీ ఆరేళ్ల పాటు డ్రైవింగ్ నిషేధించారు. రోడ్డు అనేది రేస్ ట్రాక్ కాదు అని, ప్రజా రవాణా రోడ్డుపై శక్తివంతమైన కార్లను పరీక్షించడం సరికాదు అని జడ్జీ రే సింగ్ తన తీర్పు సమయంలో పేర్కొన్నారు. పోటీపడి అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల ప్రాణ నష్టం జరిగినట్లు జడ్జీ తెలిపారు.
అయితే రేస్ జరగడానికి ముందు ఇద్దరికీ పరిచయం లేదని, ఓ ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగిన సమయంలో కార్లు పక్కపక్కనే ఆగడం వల్ల ఇద్దరు పరిచయం చేసుకున్నారని, ఇక వాళ్ల కార్ల సత్తాను పరీక్షించుకునేందుకు రోడ్డు రేస్ చేశారని విచారణలో తేల్చారు. బాచూ డాష్కామ్ ఫూటేజ్, రియాత్ ఫోన్ ఆధారంగా కూడా ఈ కన్ఫర్మేషన్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

