Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Radhika Apte | మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నఈ రోజుల్లో, ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. తోటి మహిళల విజయాన్ని చూసి సంతోషించాల్సింది పోయి, కొందరు వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Radhika Apte | మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నఈ రోజుల్లో, ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. తోటి మహిళల విజయాన్ని చూసి సంతోషించాల్సింది పోయి, కొందరు వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మెగా కోడలు ఉపాసన, ప్రముఖ నటి రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. మహిళల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో ఈ ఇద్దరూ తమ మాటల ద్వారా గుర్తుచేశారు. ప్రముఖ యాంకర్ సుమ నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఫర్ జాయిస్’ కార్యక్రమం ఐదో వార్షికోత్సవ వేడుకలలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన.. ఒక మహిళ సాధించిన విజయానికి మరో మహిళ కన్నీళ్లు కారణం కాకూడదని ఉపాసన పేర్కొంది
కొందరు తమ స్వార్థం కోసం ఇతరులకు అన్యాయం చేయడం వల్ల అమాయకుల జీవితాలపై కూడా ప్రభావం పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, ఒకరికొకరు అండగా నిలవాలని సూచించారు. వ్యక్తిగత విజయాల కంటే మానవత్వం, ఇతరుల పట్ల చూపించే గౌరవమే ముఖ్యమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మహిళలు తమ విజయాల కోసం ఇతర మహిళలను వెనక్కి లాగకుండా, కలిసి ముందుకు సాగాలని ఉపాసన సందేశమిచ్చారు. మరోవైపు ప్రముఖ నటి రాధిక ఆప్టే కూడా ఇదే అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణాది నటి కీర్తి సురేష్‌తో కలిసి నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
సినీ పరిశ్రమలో మహిళలు ఒకరికొకరు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారనుకోవడం సరైంది కాదని రాధిక అభిప్రాయపడ్డారు. మనకు అండగా ఉంటారని భావించే మహిళలు కూడా కొన్ని సందర్భాల్లో సహకరించకపోవచ్చని ఆమె పేర్కొంది. అయితే, ప్రస్తుతం సినిమా సెట్లలో మహిళల సంఖ్య పెరుగుతోందని, అందరినీ సమానంగా చూసే విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. తోటి మహిళలకు సహాయం చేయడం నేర్చుకోవాలని, సమాజంలో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రాధిక సూచించారు. ఉపాసన, రాధిక ఆప్టే వ్యాఖ్యలు వేర్వేరు సందర్భాల్లో వచ్చినప్పటికీ, ఇద్దరూ చెప్పిన ప్రధాన విషయం ఒక్కటే. మహిళలు తమ మధ్య పోటీని ఆరోగ్యకరమైన రీతిలో కొనసాగిస్తూ, ఎదుటివారి విజయాన్ని కూడా గౌరవించాలి. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, సినిమా పరిశ్రమ వంటి రంగాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు పరస్పర సహకారం ఎంతో ఉపయోగపడుతుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ladies
- Radhika apte
- suma
- upasana
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

