Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Jail Break: సోమవారం రాత్రి తేని జిల్లాలోని సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ అయ్యారు. మూర్ఛ వచ్చినట్లు కొందరు నటించారు. దీంతో గార్డులు సెల్ ఓపెన్ చేశారు. వారిపై ఖైదీలు అటాక్ చేసి పరారీ అయ్యారు. దీంట్లో ఇవాళ నలుగుర్ని పట్టుకున్నారు.
మధురై : తమిళనాడులో జైల్ బ్రేక్(Jail Break) ఘటన జరిగింది. తేని జిల్లాలోని తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగింది. సుమారు 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. మూర్ఛ, ఫిట్స్ వచ్చినట్లు నటించిన ఖైదీలు.. సెల్ ఓపెన్ చేయడంతో.. గార్డులపై దాడి చేసి పరారీ అయ్యారు. అయితే పరారీ అయిన వారిలో నలుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంకా 13 మంది కోసం గాలిస్తున్నారు. కొందరు ఖైదీలు తమకు మూర్ఛ వచ్చినట్లు నటించారు. దీంతో ఖైదీల సహాయాన్ని సిబ్బంది కోరారు. అయితే జైలుగది తెరిచిన వెంటనే గార్డులపై కొందరు ఖైదీలు దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.
ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గ్రేడ్ 2 కానిస్టేబుల్ తంగపండి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రవీణ్ కుమార్, సిలంబరాసం, రాజా సికందర్, రాజ్‌కుమార్ ఖైదీలను అరెస్టు చేశారు. ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఐజీ విజయేంద్ర బిదారి తెలిపారు. పలు జిల్లాలో వేట కొనసాగిస్తున్నారు. దిండిగల్ జిల్లాలో 16 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
ఖైదీలకు చెందిన ఫోటోలను రిలీజ్ చేశారు. మధురై, దిండిగల్, కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో సర్క్యూలేట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

