న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌పై ఇరాన్ మిస్సైళ్ల(Iran Missiles) వర్షం కురిపించిన విషయం తెలిసిందే. సుమారు 200 మిస్సైళ్లతో ఇజ్రాయిల్‌పై ఇరాన్ మంగళవారం రాత్రి అటాక్ చేసింది. అయితే ఆ దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు వాడినట్లు అనుమానిస్తున్నారు. ఏ రకమైన మిస్సైల్స్ ఇరాన్ వాడి ఉంటుందని మిలిటరీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్మామెంట్ రీసర్చ్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యూనిట్లో పనిచేసే రీసర్చ్ కోఆర్డినేటర్ పాట్రిక్ సెంట్ కీలక సమాచారం ఇచ్చారు. క్షిపణి శిథిలాల ఆధారంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి ఉంటుందని అనుమానిస్తున్నారు.
⚡️BREAKING:
More footage right now from Iran’s attack on Israel, more than 400 ballistic missiles and drones launched. Israel closed the airspace.
Missiles can be clearly seen landing, the israeli air defense systems were rended useless.
This is just the first wave. pic.twitter.com/mETAlGywis
— Suppressed News. (@SuppressedNws) October 1, 2024
సాధారణ క్రూయిజ్ మిస్సైళ్ల కన్నా.. బాలిస్టిక్ మిస్సైళ్లు టార్గెట్ అత్యంత వేగంగా చేరుకుంటాయి. ఇరాన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ క్షిపణుల్లో.. ఎక్కువ శాతం బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన మిస్సైల్ డిఫెన్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ థామస్ కారక్కో .. ఇరాన్ వాడిన మిస్సైళ్లపై క్లారిటీ ఇచ్చారు. తాజా దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు వాడినట్లు ఆయన స్పష్టం చేశారు.
గత ఏప్రిల్‌లో జరిగిన దాడికి, మంగళవారం రాత్రి జరిగిన దాడికి మధ్య ఉన్న తేడాను సీఎస్ఐఎస్ సీనియర్ అడ్వైజర్ మార్క్ కాన్సియన్ వివరించారు. తాజా దాడిలో ఎక్కువ శాతం క్షిపణులు ఇజ్రాయిల్‌ను చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. బాలిస్టిక్ మిస్సైళ్లను.. మిస్సైల్ రక్షణ వ్యవస్థ అడ్డుకోవడం అతి కష్టంగా ఉంటుంది. బాలిస్టిక్ క్షిపణులకు వేగంగా ఎక్కువ కనుక, వాటిని అడ్డుకోవడం సులువైన విషయం కాదన్నారు.
Israel Iron Dome failed to stop Iran Missiles that strike Tel Aviv
It seems like the World War 3 is hereThe US and Israel are behind the WWIII pic.twitter.com/S1WZw3a7SF
— World life (@seautocure) October 1, 2024
సుమారు 180 క్షిపణులను ఇరాన్ వదిలినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. అయితే ఆ క్షిపణులను ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్సెప్ట్ చేసినట్లు ఇజ్రాయిల్ భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఎక్కడెక్కడ ఆ మిస్సైళ్లను హిట్ చేశారో వాటిని గుర్తిస్తున్నామని, దాని వల్ల ఏర్పడిన నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నామన్నారు.
ఆకస్మిక దాడి చేసిన ఇరాన్ వద్ద ఎన్ని రకల క్షిపణులు ఉన్నాయి. వాటి రేంజ్ ఏంతో తెలుసుకుందాం. అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ వద్ద చాలా రకాల మిస్సైళ్లు ఉన్నాయి. వాటిల్లో షాహబ్-1 మిస్సైల్ .. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేరుకోగలదు. ఫతేహ్-110 మిస్సైల్ సుమారు 300 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్‌ను చేరుకుంటుంది.
షాహబ్-2 మిస్సైల్ సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. జోల్ఫాగర్ మిస్సైల్ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేరుకుంటుంది. ఖయిమ్-1 మిస్సైల్ 750 కిలోమీటర్ల దూరంలో టార్గెట్‌ను చేధిస్తుంది. షాహబ్-2 మిస్సైల్ సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేరుకుంటుంది.